గుంటూరు కలెక్టరేట్ వద్ద AISF ధర్నా

గుంటూరు కలెక్టరేట్ వద్ద AISF ధర్నా

GNTR: కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం AISF జిల్లా సమితి ధర్నా చేపట్టింది. AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 6,400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. జీవో నం.77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రలో విద్యార్థిరంగ సమస్యల పరిష్కారానికి లోకేశ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు.