VIDEO: 'రైతులు తమ పశువులకు టీకాలను వేయించాలి'
NRML: రైతులంతా విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు తమ పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని సూచించారు.