VIDEO: అనపర్తిలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ

E.G: ఏయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నివారించవచ్చని అనపర్తి జిబిఆర్ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ ఎస్.వి. వి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా అనపర్తిలో నర్సింగ్ విద్యార్థినులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్‌లో ప్లకార్డులు పట్టుకుని గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు.