విద్యార్థిని చితకబాదిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు
NLR: ఉదయగిరి బాలాజీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో విద్యార్థిపై నిర్వాహకుడు అంజయ్య వాతలు పడేలా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కలిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఆరో తరగతి నవోదయ ప్రవేశానికి ముందస్తుగా ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఇక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది.