VIDEO: పెట్రోల్ కొరతతో వాహనదారులకు తప్పని తిప్పలు
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోనీ ప్రధాన పెట్రోల్ బంకుల్లో గత కొన్ని రోజులుగా 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆఫీసులు, వివిధ పనులకు వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. సరఫరాలో అంతరాయం వల్ల కొత్త స్టాక్ రావడం లేదని, బంకు యజమానులు వినియోగదారులకు తెలియపరుస్తున్నారు. ఈ మేరకు తొందరగా ఇంధనం కొరత తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు.