‘ప్లీజ్.. నా భర్త శవం తెప్పించండి'

‘ప్లీజ్.. నా భర్త శవం తెప్పించండి'

NRML: ఉపాధి కోసం దేశం దాటి వెళ్లిన వ్యక్తి అక్కడే మరణించడంతో ఆ కుటుంబం పెద్దను కోల్పోయింది. తాము కడచూపునకు కూడా నోచుకోలేదని మృతుడి భార్య, పిల్లలు వాపోయారు. దస్తూరాబాద్ మండలం మున్యాలకు చెందిన మమత భర్త సురేశ్ ఉజ్బెకిస్తాన్‌లో 22 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. తన భర్త మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని సోమవారం మమత నిర్మల్ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.