సోమేశ్వర ఆలయంలో ఈనెల 26న హుండీ లెక్కింపు

JN: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 26న ఉదయం 10:30కు హుండీ లెక్కించనున్నట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిస్తామన్నారు.