విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: నర్సంపేట పట్టణంలో  లైన్ మరమ్మతు పనుల కారణంగా ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. బాయ్స్ హై స్కూల్ రోడ్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాంతం, కోర్ట్ ఏరియా, నగర పంచాయతీ రోడ్, జీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ విజయ భాస్కర్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.