'ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి'
HNK: ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చావత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగవంతంగా అయ్యేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.