ఈ నెల 12న జాబ్ మేళా

ఈ నెల 12న జాబ్ మేళా

NZB: నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇమార్టికస్ సహకారంతో హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ యూనియన్, యాక్సిస్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో శాశ్వత ప్రాతిపదికన పని చేసేందుకు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారని పేర్కొన్నారు.