వల్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శివనాగిరెడ్డి
KDP: వల్లూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రేనాటి శివనాగిరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన పెద్ద ఓబన్న కడప స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. తాళ్ల పొద్దుటూరు నుంచి శివనాగిరెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి కృషి చేస్తానన్నారు.