జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధం
SKLM: ఇచ్చాపురం మండలం కొనిసి వద్ద NH16పై ఆంధ్రా నుంచి ఒడిశాకు వెళ్తున్న కంటైనర్‌కు శనివారం అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై బయటపడినా స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.