అనాథ బాలికలకు అండగా నెక్కొండ ఎస్సై
WGL: నెక్కొండ మండలం పెద్దకొర్పోల్ గ్రామంలో ఏలియా, మమత దంపతుల మరణంతో అనాథలైన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై నెక్కొండ ఎస్సై మహేందర్ స్పందించారు. తన సొంత ఖర్చులతో బాలికల కోసం రెండు గదుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఆయన, సోమవారం గ్రామంలో ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ చర్య పలువురి ప్రశంసలు పొందుతోంది.