పశువులను తరలిస్తున్న డీసీఎం పట్టివేత
NRPT: మరికల్ మండల అనుమతి లేకుండా ఓ డీసీఎంలో పశువులను తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. డీసీఎంను పరిశీలించగా అందులో 8 ఎద్దులు, 5 ఆవులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా తరలిస్తున్న డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు. పట్టుబడిన పశువులను నర్వ మండలం గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.