VIDEO: ఉద్యోగి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు
HNK: హన్మకొండ నగరంలోని నక్కలగుట్ట ఎన్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతదేహంతో మంగళవారం ఆందోళన చేపట్టారు. గుండ్లసింగారం సబ్ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బంధువులు, తోటి కార్మికులు ఆందోళనకు దిగారు.