ప్రణాళికతో చదివి మంచి మార్కులు సాధించాలి: కలెక్టర్
WNP: కొత్తకోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాస్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలని సూచించారు.