విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
BPT: బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ప్రణాళికతో చదవాలని అన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.