నదిలో పడి మహిళ గల్లంతు

SRPT: చింతలపాలెం మండలం చింత్రియాలకి చెందిన సైదమ్మ కృష్ణ నదిలో గల్లంతైంది. ఆదివారం గేదెలు మేపడానికి గ్రామ శివారులోని బల్లకట్టు సమీపంలో ఆమె ప్రమాదవశాత్తు నదిలో పడింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు నది ఒడ్డుకు వెళ్లి చూడగా ఆమె చెప్పులు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గాలింపు చర్యలు చేపట్టారు.