బ్రహ్మంగారి మఠం మాస కళ్యాణానికి విరాళం

KDP: బ్రహ్మంగారి మఠంలో నిర్వహించనున్న గోవింద మాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కళ్యాణానికి బుధవారం విరాళం అందింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన రఘువీరారెడ్డి, దయానంద ఆచారి రూ.1,12,116లు ఆలయ ఫిట్ పర్సన్ శంకర బాలాజీ, మఠం మేనేజర్ ఈశ్వర చారికి అందజేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.