అనుమానంతో భార్యపై భర్త.. దాడి

అనుమానంతో భార్యపై భర్త.. దాడి

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో తీవ్ర  విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న నరేష్–విజయ దాంపత్య జీవితం అనుమానాలు, వేధింపులతో విభేదాలకు దారి తీసింది. పుట్టింట్లో ఉంటున్న విజయపై కోపంతో నరేష్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నరేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.