విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

NGKL: విద్యాభివృద్ధికి విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో నిర్వహించిన బోధనభ్యాస సామాగ్రి మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.