'అధ్వానంగా అంకోలి అంతర్గత రహదారులు'

'అధ్వానంగా అంకోలి అంతర్గత రహదారులు'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. అంకోలి గ్రామ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారుతున్నాయి. దీంతో రోడ్లపై కంకర తేలి ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.