రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

VSP: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలన్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులకు పార్కింగ్ ప్రదేశం లేక ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.