మంత్రిని కలిసిన వందేమాతరం శ్రీనివాస్

HYD: ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సంగీత, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై చర్చించారు. వాటి అభివృద్దికి మంత్రి సానుకూలంగా స్పందించారు. కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వ తపనను మంత్రి పునరుద్ఘాటించారు.