నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత: రాయదుర్గం ఎమ్మెల్యే

నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత: రాయదుర్గం ఎమ్మెల్యే

ATP: జిల్లాకు జీవనాడిగా నిలిచే తుంగభద్ర హెచ్‌.ఎల్‌.సీ. సాగునీటి సలహా మండలి సమావేశంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన త్రాగునీటి అవసరాలు, రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని చర్చించి, నీటి చౌర్యం, వృథా, అనధికార వాడకాన్ని అరికట్టి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు.