శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
SRCL: సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రామ్ దాసు అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన ప్రకటన ఓ విడుదల చేశారు. PMSRI పాఠశాలల్లోని విద్యార్థినిలకు ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు 11 సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకులు కావాలని పేర్కొన్నారు. కరాటే, కుంగ్ఫు, జూడోలో అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవాలన్నారు.