రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
KMR: బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆదివారం SI ఆంజనేయులు తెలిపారు. ఉప్పరపల్లి గ్రామానికి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీస్ సిబ్బంది పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారులో రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.