ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత
KDP: ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చెక్‌పోస్టులు, సీసీటీవీ, డ్రోన్ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్నప్రసాద పంపిణీ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.