ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. రవి కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సూచనలు చేశారు.