ఐదుగురు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్
ప్రకాశం: జిల్లాలోని పలు దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4,70,000 విలువైన వస్తువులను జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. దర్శి డీఎస్పీ అద్దంకి రూరల్ సీఐమల్లికార్జున్, సీసీఎస్ సీఐ భీమానాయక్‌లు ప్రత్యేకంగా దర్యాప్తు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు.