రెడ్ రిబ్బన్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన పెనుకొండ విద్యార్థులు

రెడ్ రిబ్బన్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన పెనుకొండ విద్యార్థులు

సత్యసాయి: పెనుకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెడ్ రిబ్బన్ జిల్లా స్థాయి క్విజ్ కాంపిటీషన్ సోమవారం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు శబరిన్ తాజ్, నిజాముద్దీన్ జిల్లా స్థాయిలో గెలుపొందారు. వీరికి జిల్లా రెడ్ రిబ్బన్ అధికారి మునిరత్నం రూ.4 వేల నగదు బహుమతి అందజేశారు. రేపు రాష్ట్రస్థాయి క్విజ్ కాంపిటీషన్లో విద్యార్థులు పాల్గొననున్నారు.