విద్యుత్ ప్రమాదాలపై అవగాహన

విద్యుత్ ప్రమాదాలపై అవగాహన

NLG: త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో మంగళవారం విద్యుత్ పల్లె బాట కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ రూరల్ ఏడి కె. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకి విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వర్షం పడేప్పుడు స్థంభాలు ముట్టుకోకుండా ఉండడం, ట్రాన్స్‌ఫార్మర్  ఏబి స్విచ్‌లను తాకొద్దని, ఎల్ టీ, హెచ్ జీ ఫ్యూజులు మార్చొద్దని సూచించారు.