VIDEO: డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బందికి బ్యాలెట్ బాక్సుల ఎన్నికల సామాగ్రిని అందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సామాగ్రిని అందించాలని సూచించారు.