అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
KNR: బోయినపల్లిలోని రామాలయం సమీపంలో 4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులు కోట పోచయ్య, నల్లగొండ రాకేష్‌లు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పై రమాకాంత్ హెచ్చరించారు.