డిప్యూటీ ఎంపీడీవోగా సురేశ్ బాబు
NDL: సంజామల మండల పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణ డిప్యూటీ ఎంపీడీవోగా హెచ్.సురేశ్ బాబు బాధ్యతలు స్వీకరించినట్లు ఎంపీడీవో ఐ.సాల్మన్ తెలిపారు. సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఆయనకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి కల్పించడంతో సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. సురేశ్ బాబుకు ఎంపీడీవో సాల్మన్ శుభాకాంక్షలు తెలిపారు.