చిన్నశంకరంపేట PHCని తనిఖీ చేసిన కలెక్టర్

చిన్నశంకరంపేట PHCని తనిఖీ చేసిన కలెక్టర్

MDK: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం చిన్నశంకరంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందుల నిల్వలు, వాటి రిజిస్టర్ను, సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలను జాగ్రత్తగా ఉంచాలని వైద్యులకు సూచించారు