24న పరీక్షలు.. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి: DEO

GNTR: టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఈ నెల 24న సెయింట్ జోసఫ్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అందరూ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీ.వీ రేణుక మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెగ్యులర్, ఒకసారి తప్పిన వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.