బస్సులో మంటలు.. ఒకరు మృతి
TPT: తిరుపతి జిల్లా బాలాయపల్లిలోని ఓ ప్రైవేట్ బస్సులో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.