కళ్యాణ మండప నిర్మాణానికి విరాళం అందజేత
JGL: వెల్గటూర్ మండలం జగదేవపేట్ శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ కళ్యాణ మండప నిర్మాణానికి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ గోపాల్ రెడ్డి రూ. 25,000 విరాళం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, ఆర్థిక సాయం అందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని, అవసరమైతే మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానన్నారు.