యాగంటి ఆలయానికి రూ.60 లక్షల ఆదాయం

యాగంటి ఆలయానికి రూ.60 లక్షల ఆదాయం

NDL: కార్తీక మాసం సందర్భంగా యాగంటి పుణ్యక్షేత్రానికి రూ. 60,89,081 ఆదాయం లభించినట్లు ఈవో పాండురంగారెడ్డి ఇవాళ తెలిపారు. నాలుగు సోమవారాలు, పౌర్ణమి కలిసి వచ్చిన నెలలో ఈ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 18,71,561 అధిక ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. హుండీలను మినహాయించి ఈ మొత్తం ఆదాయం వచ్చినట్లు ఈవో స్పష్టం చేశారు.