యూరియా కొరతతో ఆందోళన చెందుతున్న రైతులు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో యూరియా లభ్యత లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఎరువుల దుకాణాలు, గ్రోమోర్ సెంటర్లలో యూరియా లేకపోవడంతో ఖరీఫ్ వరి సాగుకు తయారవుతున్న రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ ధరకు కొనాలన్నా అందుబాటులో లేకపోవడం వల్ల అన్నదాతలు అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.