VIDEO: ఆన్‌లైన్ బూస్టర్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్
NZB: మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లిలోని జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ బూస్టర్ సిస్టమ్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడు పరిశీలించారు.పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.