ఈ నెల 21 నుంచి వినాయక ఉత్సవాలు

KDP: బద్వేల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యసిద్ధి వినాయక నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.