మడకశిరలో కంటి ఆసుపత్రి వ్యాన్ అందజేత
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డి చొరవతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగుల అవసరాల కోసం నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున గురువారం వ్యాన్‌ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్, రఘువీరా రెడ్డి జెండా ఊపి వ్యాన్‌ను ప్రారంభించారు.