రైతు సంక్షేమానికి కూటమి పెద్దపీట: మంత్రి
NDL: ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇవాళ బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.