కంబోడియాలో హీరో ఎలుకల సేవలు
కంబోడియాలో ‘హీరో ర్యాట్స్’గా పేరుపొందిన ఎలుకలు మందుపాతర్లను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి. అక్కడ మందుపాతర్ల వల్ల చాలామంది పౌరులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ‘అపోపో’ సంస్థ ఆఫ్రికాలోని ‘జెయింట్ పౌచ్డ్’ ఎలుకలకు మందుపాతర్లను వాసనతో గుర్తించే శిక్షణ ఇచ్చింది. ఈ ఎలుకల్లో రోనిన్ అనే ఎలుక 109 మందుపాతర్లను నిర్వీర్యం చేసి గిన్నిస్ రికార్డుకెక్కింది.