టీడీపీపై బొత్స సంచలన ఆరోపణలు

AP: రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఫలితం లేదని, మరుసటి రోజే మరో భూ ఆక్రమణ బయటపడుతోందని విమర్శించారు. పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు టీడీపీ నేతలందరూ భూములు దోచుకుంటున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.