పెదనందిపాడులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
GNTR: పెదనందిపాడు మండలంలోని నల్లమడ వాగు కట్ట పడమర వైపు ఉన్న ఆలపాటి ముసలయ్య పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఇవాళ లభ్యమైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మృతుడు సుమారుగా 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని అంచనా. పంట పొలాల్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.