రాజధానిపై మాట మార్చిన మాజీ సీఎం జగన్: ఎమ్మెల్యే

PLD: రాజధాని అంశంపై మాజీ సీఎం జగన్ తరచూ మాటలు మారుస్తున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం ప్రకటనలో విమర్శించారు. తొలుత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన ఆయన అనంతరం మూడు రాజధానుల ఊసు ఎత్తారన్నారు. ప్రజా వ్యతిరేకతను గమనించి తిరిగి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.