శ్రమదానం నిర్వహించిన ఎమ్మెల్యే
BDK: ఇల్లందు నియోజకవర్గ రేపల్లెవాడ గ్రామపంచాయతీలో శనివారం ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వీధి వీధి తిరుగుతూ శ్రమదానం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ పథకాలు ఆశయాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యక్రమమే ప్రగతి ప్రణాళిక అని తెలిపారు.